loading
0%దూదేకుల కేర్ ఫోర్స్ , ఇది రాజకీయ , కుల పోరాట సంఘం కాదనే విషయాన్నీ అందరికి తెలియచేయాలని ముందుగా మేము నిర్ణయించుకున్నాం. అలాగని దూదేకుల జాతికి ఎటువంటి అవమానం , అన్యాయం జరిగిన కూడా డీసీఎఫ్ ఉదాసీనతని వహించదని కూడా సుస్పష్టంగా తెలియచేస్తున్నాము .
డీసీఎఫ్ ఆశయాల్లో మొట్టమొదటిది, స్వయంప్రతిపత్తి . ఏ ఒక్కరు కూడా ప్రభుత్వపథకాలపై , ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా అన్ని కుటుంబాలను సంపాదనా మార్గాన్ని చేపట్టేలా చేయటం. ఈ ఆశయాన్ని చేరుకోవటానికి ప్రతిఒక్కరి సహకారం అవసరంగా డీసీఎఫ్ భావిస్తుంది. దీనిలో భాగంగానే డీసీఎఫ్ బిజినెస్ సర్కిల్ ని ఏర్పాటుచేసి , డీసీఫ్ మినీ మార్ట్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టటం జరిగింది.
చాలా మంది విద్యార్థుల కుటుంబాల ఆర్దికపరిస్థితుల కారణంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవలేకపోతున్నారు . అలాంటి వారికోసం కొన్ని చోట్ల ఫ్రీ offiline classes నిర్వహిస్తున్నారు . DCF కూడా తనవంతు బాధ్యతగా విద్యార్థులకు వీడియోస్ రూపంలో అందిస్తోంది.
మీ వ్యాపార అభివృద్ధికి ఆదాయం ఆశించని , మరియు వడ్డీ భారం లేనివిధంగా మీకు తోడ్పాటునివ్వదలిచాము .
Now in cicle
మీ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఇబ్బంది ఎదురైనపుడు అక్కడ ఉన్నటువంటి DCF ఆర్గనైజర్ కి సమాచారం ఇవ్వండి . లేని'పక్షంలో ఇక్కడ ఇవ్వబడిన ఫారం ద్వారా వివరాలు పంపించండి.
రాష్ట్ర వ్యాప్తంగా దూదేకుల కేర్ ఫోర్స్ ఆధ్వర్యంలో లేదా DCF ఆర్గనైజర్స్ ద్వారా జరిగే కార్యక్రమాలు ఇక్కడ పొందుపరచబడతాయి.