loading

0%

దూదేకుల కేర్ ఫోర్స్ , ఇది రాజకీయ , కుల పోరాట సంఘం కాదనే విషయాన్నీ అందరికి తెలియచేయాలని ముందుగా మేము నిర్ణయించుకున్నాం. అలాగని దూదేకుల జాతికి ఎటువంటి అవమానం , అన్యాయం జరిగిన కూడా డీసీఎఫ్ ఉదాసీనతని వహించదని కూడా సుస్పష్టంగా తెలియచేస్తున్నాము .


మరి డీసీఎఫ్ ఎందుకు ఏర్పాటు చేయటం జరిగింది ?

దూదేకుల జాతిలో దశాబ్దాలనుండి మనం వింటున్న మాట చట్టసభల్లో స్తానం పొందాలి . రాజకీయంగా మన ఉనికిని చాటుకోవాలి . దానికోసం మనవాళ్ళు బ్రతిమాలాడని రాజకీయపార్టీ లేదు , ఎక్కని నాయకుని గడప లేదు . ఈ క్రమంలో, మనకు రాజకీయంగా ఎందుకు ప్రాధాన్యత లేదు? మనల్ని ఎందుకు పార్టీలు కేవలం ఓటుబ్యాంక్ రాజకీయాలకోసం మాత్రమే వాడుకుంటున్నాయి ? లాంటి ప్రశ్నలు సంధించుకున్నపుడు వచ్చిన సమాధానం . మనం సామాజికంగా బలంగాలేము అని . మనం ఇంకొకరి ముసుగులో బ్రతకాల్సిన పరిస్థితి ఉందని . ఇలాంటి ప్రశ్నలు , సమాధానాల పరంపరలో ఏర్పడిన సంస్థ దూదేకుల కేర్ ఫోర్స్ .

అభివృద్ధికి 5 సూత్రాలు !


దూదేకుల సమాజం రాబోవు రోజుల్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలనే ఆశతో , 2029 ఎన్నికల లోపు బలమైన రాజకీయ నాయకుల్ని తయారు చేయాలనే ఆశయంతో , ప్రతి దూదేకుల కుటుంబం ఆర్ధిక పరమైన ఉన్నతిలో ఉండాలనే సద్భావంతో డీసీఎఫ్ 5 ముఖ్యమైన అంశాలపై ద్రుష్టి సారించటం జరిగింది.


1. చదువు 2. సాధికారత 3. నాయకత్వం 4. ఉపాధి 5. సహాయం & ఆరోగ్యం

అభ్యర్థన


దూదేకుల యావత్ సమాజంలోని విద్యావంతుల్ని , అనుభవజ్ఞుల్ని , సామాజిక విశ్లేషకుల్ని ప్రతి ఒక్కరిని మేము అభ్యర్ధించేది ఒక్కటే అభ్యర్ధించేది ఒకటే . మనం దశాబ్దాలనుండి అభివృధిని కోరుకుంటూనే ఉన్నాం , కానీ బలమైన ప్రయత్నం జరగలేదనే భావన ప్రతిఒక్కరిలోను ఉండిపోయింది . అలాంటి భావన నుండి బయటికి వచ్చి చిన్న ప్రయత్నంతో ...ఒక మహా సముద్రాన్ని సృష్టించాలనే కోరికతో డీసీఎఫ్ టీం ప్రయత్నాన్ని మొదలుపెట్టింది.

కానీ ఈ ప్రయత్నం ఒక మహా యజ్ఞం కావాలంటే మీ అందరి సహాయ సహకారాలు తప్పకుండ ఉండాలి . దూదేకుల సమాజ అభువృద్దికి మీ వంతు పాత్ర పోషించటానికి డీసీఎఫ్ లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం.

వ్యవస్థాపకుడు

హన్ను భాయ్