loading

0%

రాజకీయ భవిశ్యత్తుకోసం దూదేకుల బీసీ వర్గంగానే ముందుకు వెళ్ళాలి

రాజకీయ భవిశ్యత్తుకోసం దూదేకుల బీసీ వర్గంగానే ముందుకు వెళ్ళాలి 

– హన్ను భాయ్, DCF (Dudekula Care Force) వ్యవస్థాపకుడు

హైదరాబాద్, 22 అక్టోబర్ 2025:

తెలుగు రాష్ట్రాల్లో దూదేకుల సమాజంపై జరుగుతున్న కొత్త విధానానికి సంబంధించిన పరిస్థితులు చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా దూదేకుల వారిని బీసీ వర్గానికి కాకుండా కేవలం మైనారిటీ సమాజంగా ముద్ర వేయాలని ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.

ఈ పరిణామాలపై స్పందిస్తూ, Dudekula Care Force (DCF) వ్యవస్థాపకుడు హన్ను భాయ్ పేర్కొన్నారు:

“దూదేకుల వారు శతాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో బీసీ వర్గంలో కొనసాగుతున్న వారే. విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రతినిధిత్వం వంటి హక్కులు ఈ గుర్తింపు ఆధారంగా లభించాయి. ఇప్పుడు ఈ గుర్తింపును తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది దూదేకుల సమాజానికి అన్యాయం చేసినట్లే అవుతుంది .”

మత ఆచారాల పరంగా మైనారిటీ విభాగంలో ఉన్నప్పటికీ , వృత్తి విధానాల్లో బీసీ లుగా మాత్రమే దూదేకుల వారు వున్నారని . 

“ఇప్పుడే సమాజం అప్రమత్తం కాకపోతే, రాబోయే స్థానిక ఎన్నికల్లో, రాజకీయ పదవుల్లో దూదేకుల వారికి మళ్లీ నష్టాలు ఎదురవ్వవచ్చు. బీసీ హక్కులను కాపాడడం ఇప్పుడు అత్యంత ముఖ్యమైన పని.” అని అయన చెప్పారు. 

బీసీ ఉద్యమాలు ఉదృతమవుతున్న తరుణంలో ,  అగ్రవర్ణ సంస్థలు , బీసీ లని వర్గాలుగా విడదీసే ప్రయత్నం చేస్తున్నారని , దానికి అడ్డుకట్ట వేయాలని అయన బీసీ వర్గాలను కోరారు. 

DCF త్వరలో ఈ అంశంపై రాష్ట్రస్థాయి చర్చా సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని అయన తెలిపారు. ఇందులో ప్రముఖ బీసీ నాయకులు, అన్ని దూదేకుల సామజిక సంఘాలు,  సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొని, దూదేకుల హక్కులను రక్షించే మార్గాలను చర్చిస్తారని వివరించారు.

DCF (Dudekula Care Force) సమాజ అభివృద్ధి, బీసీ గుర్తింపు రక్షణ, రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాల కోసం పనిచేస్తుందని అయన ఈ సందర్భంగా  తెలిపారు.