loading

0%

నెల్లూరు జిల్లా దగదర్తిలో స్టేట్ దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ సొసైటీ డైరెక్టర్ అల్తాఫ్ గారికి ఆత్మీయ సన్మానం

నెల్లూరు జిల్లా, దగదర్తిలో జరిగిన గ్రామ సభలో స్టేట్ దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ సొసైటీ డైరెక్టర్ అల్తాఫ్ గారికి ఘనంగా ఆత్మీయ సన్మానం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సంఘ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొని అల్తాఫ్ గారిని శాలువాలతో సత్కరించి, తమ అభినందనలు తెలియజేశారు. సమాజ అభివృద్ధికి, ముఖ్యంగా దూదేకుల సామాజిక వర్గ అభ్యున్నతికి మరియు వారి సంక్షేమం కోసం ఆయన చేస్తున్న విశేష కృషినీ ఈ సందర్భంగా వక్తలు ప్రత్యేకంగా కొనియాడారు.

ఈ ఆత్మీయ సన్మాన వేడుకలో నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాలుపంచుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.