loading

0%

తుడిచేర్ల జడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్‌ ఎస్ఎంసీ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం తుడిచేర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నిక అత్యంత ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా ముగిసింది. నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గీతా జయసూర్య, నంద్యాల పార్లమెంట్ సభ్యులు మాండ్ర శివానందరెడ్డిల ఆదేశాల మేరకు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్ మరియు స్కూల్ హెచ్ఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ ఎన్నికను నిర్వహించారు.

నూతన కమిటీ ఎన్నిక వివరాలు:

ఈ ఎన్నికల్లో పాఠశాల అభివృద్ధికి ఆసక్తి ఉన్న సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

  • చైర్మన్: దూదేకుల ఆహమ్మద్

  • వైస్ చైర్మన్: V. మునెమ్మ

  • డైరెక్టర్లు: వడ్డీ మహేశ్వరి, పాలమరి లక్ష్మి, అనురాధ, రిజ్వాన, విజయనిర్మల, స్వర్ణ, బండారు రామకృష్ణ, భూపనపాటి శేఖర్, ఐజ యోహన్, యరుమల స్వాములు, ఓరుగంటి రాజు, బోకూరి శేఖర్, రెడ్డిపోగు శ్యామ్ రాజ్.

పాఠశాల అభివృద్ధికి సమిష్టి కృషి:

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మరియు నాయకులు మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించడం, పాఠశాల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం మరియు మౌలిక వసతుల కల్పనకు సమిష్టిగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అవసరమైన అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సురేష్ యాదవ్, వేణుగోపాల్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి కడియం పుల్లన్న యాదవ్, వానాల నీటి సంఘం చైర్మన్ కాగుల శంకర్ యాదవ్, పింజరి దస్తగిరి, మహంకాళి గురువయ్య, కొత్తపేట నారాయణ, నేతకొట్టు పుల్లయ్య, పెద్దినేని సిద్దయ్య, కొత్తపేట వెంకటేశ్వర్లు, కొల్లు పుల్లయ్య, కాకర్ల బుజ్జి, హజరత్ భాష, మహబూబ్ బాషా, కడియం మద్దిలేటి, మత్స్య కార్మికుల నాయకుడు తెలుగు వెంకటేశ్వర్లు, సంపత్ కుమార్ యాదవ్, పెండ్యాల ప్రసాద్, అబ్రహం రఘురాముడు, B. వెంకటేశ్వర్లు, B. పుల్లయ్య, రాగి గురువయ్య, అబ్రహం రామకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.