loading

0%

మడకశిర MLAకి డిసిఎఫ్ (DCF) నాయకుల వినతి పత్రం

"MLA తో మన డీసీఎఫ్" (రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం) లో భాగంగా సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే MS రాజు గారికి డిసిఎఫ్ (DCF) నాయకులు కలిసి వినతి పత్రం సమర్పించారు.

ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తూ, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. "వినతి మన వంతు - పరిష్కారం వారి బాధ్యత" అనే లక్ష్యంతో సమస్యల పరిష్కారానికై ఈ వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా DCF DO బాబా ఫక్రుద్దీన్, నియోజకవర్గ ఆర్గనైజర్ ఖలీల్, మండల కో ఆర్డినేటర్లు దాదాపీర్, అబూబకర్, సిద్దిక్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.