18, Oct-2026
loading
0%03,Oct-2026
"MLA తో మన డీసీఎఫ్" (రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం) లో భాగంగా పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి సవిత గారికి డిసిఎఫ్ (DCF) నాయకులు కలిసి వినతి పత్రం సమర్పించారు.
ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తూ, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. "వినతి మన వంతు - పరిష్కారం వారి బాధ్యత" అనే లక్ష్యంతో సమస్యల పరిష్కారానికై ఈ వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా DCF DO బాబా ఫక్రుద్దీన్, పెనుగొండ DDO షేక్షా, మండల కో ఆర్డినేటర్లు M. ఫక్రుద్దీన్, సిద్దిక్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.