loading

0%

మదనపల్లి MLAకి డిసిఎఫ్ (DCF) నాయకుల వినతి పత్రం

"MLA తో మన డీసీఎఫ్" (రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం) లో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే జనాబ్ షాజహాన్ బాషా గారికి డిసిఎఫ్ (DCF) నాయకులు కలిసి వినతి పత్రం సమర్పించారు.  

ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తూ, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. "వినతి మన వంతు - పరిష్కారం వారి బాధ్యత" అనే లక్ష్యంతో సమస్యల పరిష్కారానికై ఈ వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.  

ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా DO ఇమామ్ బాషా, మదనపల్లి DDO P. ఆష్రాఫ్, తంబళ్లపల్లి DDO కొతాలం బాబు, రామసముద్రం ACO T. మస్తాన్, నిమ్మనంపల్లి ACO ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.