loading

0%

తాడిపత్రి: ఏపీ ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ (ADPSA) వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీ దూదేకుల బాబయ్య ఎన్నిక

తాడిపత్రి పట్టణంలోని ప్రతిష్టాత్మక సూర్య హై స్కూల్ అధినేత, ప్రముఖ విద్యావేత్త శ్రీ దూదేకుల బాబయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ (ADPSA) వైస్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తాడిపత్రి దూదేకుల ముద్దుబిడ్డగా విద్యా రంగంలో ఆయన చేస్తున్న నిరంతర కృషికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అందిస్తున్న సేవలకు ఈ రాష్ట్ర స్థాయి పదవి తగిన గుర్తింపుగా నిలిచింది. ఈ ఎన్నిక పట్ల తాడిపత్రి పట్టణ విద్యావర్గాలు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల అభివృద్ధికి, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఆయన మరింత సమర్థవంతంగా సేవనందిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.

అభినందనలతో: అబ్దుల్ రజాక్ నూర్ భాషా మీడియా: 9000940469 / 9000113780

చిరునామా: సూర్య హై స్కూల్ & డిస్టెన్స్ ఎడ్యుకేషన్, నంద్యాల రోడ్డు, తాడిపత్రి టౌన్ - 515411, అనంతపురం జిల్లా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్.