loading

0%

అనంతపురంలో అక్టోబర్ 11న "దూదేకుల వికాసం" రౌండ్ టేబుల్ సమావేశం

అనంతపురం జిల్లా కేంద్రంలో డీసీఎఫ్ (DCF) అనంతపురం జిల్లా విభాగం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా "దూదేకుల వికాసం" రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

రాబోయే అక్టోబర్ 11, 2026 (ఆదివారం) ఉదయం సరిగ్గా 10:00 గంటలకు నగరంలోని నూర్బాష చమన్ ఫంక్షన్ హాల్ ఈ సమావేశానికి వేదిక కానుంది.

సమాజిక వికాసం, భవిష్యత్ కార్యాచరణ మరియు పలు కీలక అంశాలపై చర్చించనున్న ఈ సమావేశానికి అన్ని జిల్లాల, నియోజకవర్గాల ఆర్గనైజర్లు, మండల మరియు గ్రామ కోఆర్డినేటర్లు, అలాగే డీసీఎఫ్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానించారు.

మరిన్ని వివరాలు మరియు సంప్రదింపులకు: ఈ సమావేశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నా లేదా వివరాలు కావాలన్నా క్రింది నంబర్లను సంప్రదించవచ్చు:

  • చంద్‌బాషా (DO): 89775 86145

  • దాదాపీర్ (DDO): 77801 66723

  • షక్షావలి (ACO): 99897 94381