18, Oct-2026
loading
0%07,Oct-2026
డీసీఎఫ్ (DCF) రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు (MLA) శ్రీ కందికుంట్ల వెంకట ప్రసాద్ గారిని డీసీఎఫ్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి, తమ డిమాండ్లు మరియు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
"వినతి మన వంతు - పరిష్కారం వారి బాధ్యత" అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా... సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల సహకారం కోరడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
డి. బాబా (సత్యసాయి జిల్లా DO)
బాబ్జాన్ (కదిరి DDO)
సులేమాన్ (తనకల్లు ACO)
బి. బావాజీ (తలపుల ACO) తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు.