loading

0%

పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ దూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారికి వినతి పత్రం అందజేసిన డీసీఎఫ్ ప్రతినిధులు

"MLA తో మన డీసీఎఫ్" రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా పొన్నూరు నియోజకవర్గంలో కీలక కార్యక్రమం నిర్వహించబడింది. ఈరోజు ఉదయం పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు (MLA) శ్రీ దూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారిని దూదేకుల కేర్ ఫోర్సెస్ (DCF) గుంటూరు జిల్లా ఆర్గనైజర్ షేక్ శివా వలి మరియు ఇతర ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా దూదేకుల సమాజ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. "వినతి మన వంతు - పరిష్కారం వారి బాధ్యత" అనే నినాదంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.