18, Oct-2026
loading
0%09,Oct-2026
డీసీఎఫ్ (DCF - Fight for Rights) రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారిని డీసీఎఫ్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి డీసీఎఫ్ ప్రతినిధుల బృందం వినతిపత్రాన్ని అందజేసింది.
కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు:
* హన్ను భాయ్ – డీసీఎఫ్ ఫౌండర్ (వినతిపత్రం అందజేశారు)
* సైదులు – డీసీఎఫ్ పల్నాడు జిల్లా ఆర్గనైజర్
* శీనావలి – డీసీఎఫ్ గుంటూరు జిల్లా ఆర్గనైజర్
* హుస్సేన్ వలి – డీసీఎఫ్ మీడియా ఆర్గనైజర్
వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే శ్రీ భాష్యం ప్రవీణ్ గారు సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. "వినతి మన వంతు - పరిష్కారం వారి బాధ్యత" అనే నినాదంతో ప్రజా సమస్యల సాధనకై డీసీఎఫ్ కృషి చేస్తోందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.