loading

0%

ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిలప్రియ గారికి వినతిపత్రం అందజేసిన డీసీఎఫ్ (DCF) ప్రతినిధులు

ఆళ్లగడ్డ (ప్రత్యేక ప్రతినిధి):

డీసీఎఫ్ (దూదేకుల కేర్ ఫోర్స్) రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గ శాసనసభ్యురాలు (MLA) శ్రీమతి భూమా అఖిలప్రియ గారిని డీసీఎఫ్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి, తమ డిమాండ్లు మరియు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

"వినతి మన వంతు - పరిష్కారం వారి బాధ్యత" అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా... సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల సహకారం కోరడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:

 * దూదేకుల అహమ్మద్ (నంద్యాల జిల్లా DCF ఆర్గనైజర్)

 * దూదేకుల కొట్లో బాబు (ఆళ్లగడ్డ నియోజకవర్గం DCF ఆర్గనైజర్)

 * కొట్లో అబ్దుల్ జిలానీ (మండల ఆర్గనైజర్)

 * దత్తు తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పిం

చారు.