loading

0%

శాసన మండలి సభ్యుడిగా నాగబాబు ప్రమాణ స్వీకారం

శాసన మండలి సభ్యుడిగా నాగబాబు ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా నేడు  కొణిదెల నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు.  ఎమ్మెల్యే విభాగంలో శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ నాగబాబు తో మండలి చైర్మన్ శ్రీ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం శాసన మండలిలో చైర్మన్ కార్యాలయంలో జరిగింది. జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వంలో ఆయనకు ఈ పదవిని పవన్ కళ్యాణ్ కట్టబెట్టిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా జనసేనకు చెందిన పలువురు నాయకులు, టిడిడి.కి చెందిన నాయకులు హాజరయ్యారు. నాగబాబు భార్యతో సహా వచ్చారు. ఈ పదవి రావడంపట్ల పార్టీకి, కార్యకర్తలకు, చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు క్రుతజ్జతలు తెలియజేశారు. మండలి సభ్యుడిగా ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవలే జనసేన ఆవిర్భావ సదస్సులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాగబాబు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యారు. ఇక పదవి తర్వాత ఆయన ప్రవర్తనలో మార్పువస్తుందో లేదో చూడాలి.