loading

0%

500 నోట్లలో భారీగా నకిలీలు

500 నోట్లలో భారీగా నకిలీలు - ఫేక్ ప్రింటర్లు ఈ ఒక్క మిస్టేక్ చేశారట - ఇలా గుర్తించండి !

RBI: మార్కెట్‌లోకి భారీగా ఫేక్ 500 నోట్లు వచ్చినట్లుగా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఫేక్ నోట్లు ప్రింట్ చేసిన వారు ఓ తప్పు చేశారని తెలిపింది.

 దేశంలోకి  అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన నకిలీ రూ.500 నోట్లు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ విషయంపై  కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నకిలీ నోట్లను గుర్తించడం కష్టంగా ఉంటుందని చెలామణి చేసేటప్పుడు పరిశీలనగా చూడాలని కోరింది.  ఈ సమాచారాన్ని డీఆర్‌ఐ, ఎఫ్‌ఐయూ, సీబీఐ, ఎన్‌ఐఏ, సెబీతో కూడా  ఇచ్చింది. 

దొంగ నోట్లు ప్రింట్ చేసిన వారు అత్యంత నాణ్యత పాటించారు.  చాలావరకు అసలు నోట్లులాగే ఉంటాయి. అయితే ఓ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ చేశారు.  “RESERVE BANK OF INDIA" అనే దానిలో ‘‘RESERVE’’ పదంలో ‘E’ బదులు ‘A’ని ఉపయోగించారు.  ఈ చిన్న తప్పును గుర్తిస్తే మంచి నోటు.. దొంగ  నోటుకు తేడా తెలుస్తుందని కేంద్ర హోంశాఖ తెలిపింది.  ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని వెల్లడించింది. వీటి విషయంలో ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఏజెన్సీలను అప్రమత్తంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే  ఇవి  చెలామణిలోకి  వచ్చాయి.   మొత్తం ఎన్ని ఉన్నాయో గుర్తించడం కష్టం. అనుమానాస్పద నోట్లను గుర్తించినప్పుడు అధికారులకు సమాచారం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సూచించింది. నకిలీ నోట్ల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకువచ్చింది. 

ఫేక కరెన్సీ ఇటీవలి కాలంలో  పలు చోట్ల బయట పడుతున్నాయి. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే గత మార్చి ఒకటో తేదీన కొన్ని వీడియోలతో ఓ ట్వీట్ చేశారు. ఇన్ స్టాలో బహిరంగంగా మిషన్లకు కూడా దొరకని దొంగ నోట్లు అమ్ముతున్నారని ఆరోపించారు.  

కేంద్ర నోట్ల రద్దు చేయడం వల్లనే ఇలా దొంగ నోట్లు పెరిగిపోాయయని ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఇప్పటికే చాలా మంది మోసాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.                        

దొంగ నోట్లను.. నోట్లను పోలిన నోట్లను ప్రింట్ చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.