నేటి వార్తల ముఖ్యాంశాలు
నేటి వార్తల ముఖ్యాంశాలు
- ఈనెల 12న లేదా 14న తల్లికి వందనం అందిస్తాం. అన్నదాత సుఖీభవ పథకం కూడా ఈ నెలలోనే. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు.
- ఈనెల 10న రాష్ట్రపతి విశాఖ పర్యటన వాయిదా.
- రేపటి నుండి ఏపీ పీజీసెట్ పరీక్షలు ప్రారంభం. 9, 10, 11, 12 తేదీలలో మూడు షిఫ్టులలో నిర్వహణ.
- ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల. 53% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు. రేపటినుండి రివెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులు.
- కార్మిక చట్టాలలో కీలక మార్పులు. రోజుకు 10 గంటల పని.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
- రేపు పార్వతీపురంలో మంత్రి లోకేష్ పర్యటన.
- ఉపాధ్యాయుల బదిలీలకు ఆన్ లైన్ విధానమే మేలు.. రాజకీయ జోక్యం, పైరవీలు ఉండవంటూ పాఠశాల విద్యాశాఖ వెల్లడి.
- ఈనెల 15 నుండి సెప్టెంబర్ 15 వరకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో రోజువారి 114 విమానాలు రద్దు. ఒక రన్ వే ఆధునీకరణ నిమిత్తం మూసేస్తున్నట్లు వెల్లడి.
- పిడి చట్టాన్ని ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా వాడాలని ఓ కేసు విచారణ సుప్రీంకోర్టు వెల్లడి.
- రికార్డ్ స్థాయిలో పరుగులు పెడుతున్న వెండి ధరలు. కిలో 1,05,000 కు చేరిక.