loading
0%07,Jul-2026
మంత్రి ఎస్. సవితను మర్యాదపూర్వకంగా కలిసిన నూర్ బాషా దూదేకుల కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్లు
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత-జౌళి శాఖల మంత్రివర్యులు ఎస్. సవిత గారిని విజయవాడలోని వారి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నూర్ బాషా దూదేకుల కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూర్ బాషా దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరును నూర్ బాషా దూదేకుల కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్గా మార్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే, క్షేత్రస్థాయిలో కార్పొరేషన్ బైలాస్ రూపకల్పన, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, సిబ్బంది నియామకం మరియు కార్యాలయాల కేటాయింపులో జరుగుతున్న జాప్యాలను మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు.
దీనిపై స్పందించిన మంత్రి ఎస్. సవిత గారు వెంటనే సంబంధిత శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడటంతో పాటు ఈ-మెయిల్ ద్వారా కూడా ఆదేశాలు జారీ చేసి, ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.