loading

0%

తెలంగాణలో కొత్త నేషనల్ హైవే - వైజాగ్ కి ఇక చాలా సులభం

తెలంగాణలో కొత్త నేషనల్ హైవే

తెలంగాణలో కొత్త నేషనల్ హైవే అందుబాటులోకి రానుంది. ఖమ్మంనుంచి దేవరపల్లి (తూర్పుగోదావరి) వరకు నిర్మిస్తున్న ఈ 162 కి.మీ.ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు చివరి దశలో ఉన్నాయి. ఆగస్టు 2025 నాటికి ఇది పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నాలుగు వరుసల రహదారి హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయాన్ని, దూరాన్ని (56 కి.మీ.) గణనీయంగా తగ్గిస్తుంది.తెలంగాణలో కొత్తగా మరో నేషనల్ హైవే అందుబాటులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే (NH-365BG) పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆగస్టు 2025 నాటికి ఈ రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్-విశాఖపట్నం కారిడార్ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన విషయం తెలిసిందే.

తెలంగాణలోని ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వరకు మొత్తం 162 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మిస్తున్నారు. తెలంగాణ పరిధిలో 89 కిలోమీటర్ల మేర పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు వెళ్లాలంటే విజయవాడ మీదుగా 619 కిలోమీటర్లు ప్రయాణించి సుమారు 12 గంటల సమయం పడుతుంది. ఈ కొత్త రహదారి అందుబాటులోకి వస్తే, విజయవాడకు వెళ్లకుండానే నేరుగా సూర్యాపేట నుంచి ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా విశాఖపట్నం చేరుకోవచ్చు. ఇది 56 కిలోమీటర్ల దూరభారాన్ని తగ్గించి, ప్రయాణ సమయాన్ని గణనీయంగా ఆదా చేస్తుంది.