loading

0%

SEEDAP లో 19 జిల్లా మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

SEEDAP లో 19 జిల్లా మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (SEEDAP) లో కాంట్రాక్ట్ ప్రతిపాదికన 19 జిల్లా మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది.

అర్హతలు: బ్యాచిలర్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.

గ్రామీణాభివృద్ధి, సోషల్ వర్క్, సోషియాలజీ, పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ లేదా MBA (రూరల్ మేనేజ్‌మెంట్) వంటి వాటికి ప్రాధాన్యత. కంప్యూటర్ అప్లికేషన్స్/IT/MIS లో 6 నెలల సర్టిఫికేషన్/డిప్లొమా. 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

 జీతం: నెలకు ₹35,000

వయస్సు పరిమితి: 01.08.2025 నాటికి గరిష్టంగా 45 సంవత్సరాలు

ఎంపిక విధానం:

  • ▪️షార్ట్‌లిస్టింగ్
  • ▪️ఇంటర్వ్యూ (వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా)
  • ▪️డాక్యుమెంట్ వెరిఫికేషన్

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 02.08.2025

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 04.08.2025

అప్లికేషన్ చివరి తేదీ: 15.08.2025 (సాయంత్రం 5:00 గం. IST)

ఎలా దరఖాస్తు చేయాలి:

మీ అప్లికేషన్‌ను recruitment.seedap@gmail.com అనే ఇమెయిల్ అడ్రస్‌కు పంపాలి. ఇమెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో "Application for the Post of Jobs District Manager, SEEDAP" అని రాయాలి.

కింది డాక్యుమెంట్లను PDF ఫార్మాట్‌లో పంపాలి:

  • ▪️అప్‌డేటెడ్ రెజ్యూమ్
  • ▪️SSC సర్టిఫికేట్ (వయస్సు రుజువు కోసం)
  • ▪️డిగ్రీ/పీజీ సర్టిఫికేట్లు
  • ▪️టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్
  • ▪️అనుభవ సర్టిఫికేట్లు
  • ▪️కుల/PH సర్టిఫికేట్ (అవసరమైతే)
  • ▪️ఆధార్ కాపీ