loading
0%25,Aug-2025
స్విమ్స్ యూనివర్సిటీ నందు 2025-26 విద్యా సంవత్సరం నకు గాను పలు పి.జి. కోర్సులకు అడ్మిషన్స్ నోటిఫికేషన్
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) యూనివర్సిటీ తిరుపతి నందు 2025-26 విద్యా సం॥కు గానూ పలు పి.జి. కోర్సులకు సంబంధించి 01.08. 2025 వ తేది నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లు స్విమ్స్ రిజిస్ట్రార్ గారు తెలియజేశారు.
కోర్సు వివరములు :
యం.యస్ సి నర్సింగ్, (M.Sc. Nursing), యం.పి.టి. (M.P.T) యం.యస్సీ అల్లెడ్ హెల్త్ సైన్సెస్ (M.Sc. Allied Health Sciences), యం.యస్ సి క్లినికల్ వైరాలజీ, (MSc.Clinical Virology),
యం.యస్ సి క్లినికల్ సైకాలజీ ( MSc clinical psychology) మరియు స్పెషలైజ్డ్ నర్సింగ్ (Post Basic Diploma in Nursing Programme) మొదలగు కోర్సులకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులు స్విమ్స్ వెబ్సైట్ లభ్యమగును. వివరాలకు స్విమ్స్ వెబ్సైట్ https://svimstpt.ap.nic.in ను సందర్శించగలరు.
*కాగా దరఖాస్తు చివరి తేదీ : 25.08.2025 నుండి
05.09.2025 వరకు పొడిగించబడింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరడమైనది*
విద్యార్థులందరికీ తెలియచేయడం కోసం దయచేసి పత్రికల వారు ప్రచురించ ప్రార్ధన