loading
0%25,Sep-2025
దూదేకుల రాష్ట్ర అధ్యక్షులు షేక్ బదే సాహెబ్
డీసీఈఎఫ్ న్యూస్ డెస్క్, ఖమ్మం:
ఖమ్మం జిల్లా స్థాయిలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయానికి దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ బదే సాహెబ్ కృతజ్ఞతలు తెలిపారు.
రైతు బంధు పథకంలో ఈసారి దూదేకుల వర్గానికి ప్రత్యేక కేటాయింపులు చేయడం తమ వర్గం సంక్షేమానికి ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు. దూదేకుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా, మండల స్థాయిల్లో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దూదేకుల సంఘం నాయకులు షేక్ మీరా గౌసుద్దీన్, షేక్ నాగ చెలిమి, షేక్ ఇస్మాయిల్, షేక్ అబ్దుల్ కరీం, షేక్ రమ్జాన్, షేక్ అబ్దుల్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.