loading

0%

దూదేకుల వర్గానికి ఆర్థిక భరోసా

దూదేకుల వర్గానికి ఆర్థిక భరోసా

‘రేవంతన్నా కా సహారా’ పథకం ప్రారంభం

హైదరాబాద్, సెప్టెంబరు 19 (DCF News Desk):
దూదేకుల వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అండ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సచివాలయంలో “రేవంతన్నా కా సహారా… మిస్కీనో కే లియే” పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ –

  • దూదేకుల వర్గాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష విలువైన మోపెడ్లు అందజేస్తామని తెలిపారు.

  • ఈ వాహనాల సహాయంతో లబ్ధిదారులు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశముందని విశ్వాసం వ్యక్తం చేశారు.

“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన వెంటనే అమలు చేసే నాయకుడు. ఆయన దూరదృష్టి వల్లే ఈ పథకం వెలువడింది. దీనికోసం ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించడం, దూదేకుల వర్గాల పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనం” అని మంత్రి అండ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజుల్లోనే ఇలాంటి పథకాన్ని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.