loading
0%13,Dec-2024
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఆరుగురు అదృష్టవంతులు ఎవరో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. అన్నీ కుదిరితే సంక్రాంతికి తెలంగాణ కేబినెట్లో కొత్త అమాత్యులు చేరబోతున్నారు. ఇందు కోసమే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని చర్చ
జరుగుతోంది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏదాది పూర్తయింది. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సహా మరో 11 మంది మంత్రులతోనే రేవంత్ సర్కార్ నడుస్తోంది. ఇంకా మరో ఆరుగురికి కేబినెట్లో అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతీ సారి క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని బాగా ప్రచారం జరిగింది. కానీ ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ హైకమాండ్ ఆదిశగా అడుగులు లేయలేదు. కొత్త యేడాదిలో సరికొత్త జోష్ తో తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తానని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం ప్రకటనకు తగినట్టుగానే సంక్రాంతిలోపే కేబినెట్ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఫోకస్ పెట్టింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీకి చేరింది. కేబినెట్ లో కొత్త ముఖాల జాబితా షార్ట్ లిస్ట్ చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భటి విక్రమార్క ఢిల్లీలో అధిష్టానం ముందు ఉంచారు. ఇప్పటికే రాహుల్ గాంధీని కలిసి కేబినెట్ విస్తరణపై చర్చించారు. తమ అనుచరులకు కేబినెట్ బెర్తులు ఇవ్వాలని అటు రేవంత్ రెడ్డి, ఇటు భట్టి విక్రమార్క పార్టీ హైకమాండ్కి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.. అయితే.. దీనిపై మళ్లీ రాహుల్ గాంధీతో చర్చించి ఫైనల్ గా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం