loading
0%06,Jan-2026
ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూలో కటాఫ్ మార్కులు సాధించిన SC, ST, OBC, EBC అభ్యర్థులు ఓపెన్ కేటగిరీ (OC) పోస్టులకు కూడా అర్హులేనని స్పష్టంగా ప్రకటించింది.
సుప్రీంకోర్టు తన తీర్పులో,
“ఓపెన్ అంటే అది నిజంగా ఓపెన్ మాత్రమే. అది ఏ కేటగిరీకీ చెందదు. మెరిట్ ఆధారంగా ఇతరులకన్నా మెరుగైన మార్కులు సాధించిన అభ్యర్థులను ఓపెన్ పోస్టుల్లోనే నియమించాలి”
అని స్పష్టం చేసింది.
రాజస్థాన్ హైకోర్టు పరిధిలోని ఒక నియామక వ్యవహారానికి సంబంధించి ఈ అంశంపై వివాదం తలెత్తింది. దీనిపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు మెరిట్‌తో కటాఫ్ మార్కులు సాధిస్తే, వారిని ఓపెన్ పోస్టుల్లో నియమించడంలో ఏ ఆటంకమూ లేదని తీర్పు చెప్పింది.
మెరిట్‌కు అత్యున్నత ప్రాధాన్యం
రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు సమాన అవకాశాలు
నియామకాల్లో స్పష్టత, న్యాయం
ఈ తీర్పుతో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కొనసాగుతున్న అనేక సందేహాలకు ముగింపు పలికినట్లయ్యింది