loading

0%

దూదేకుల సమాజానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి-సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి వినతిపత్రం

దూదేకుల సమాజానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి

సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి వినతిపత్రం

సత్యసాయి జిల్లా కలెక్టరేట్ లో ఈరోజు రాజీవ్ రంగరాజన్ మిశ్రా గారిని రాష్ట్ర నూర్ భాషా దూదేకుల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు.

రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నూర్ భాషా దూదేకుల కులస్తులు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకన్నా తక్కువ జనాభా ఉన్న కులాలకు కూడా ప్రాతినిధ్యం లభిస్తున్న నేపథ్యంలో, దూదేకుల సమాజానికి శాసనసభ మరియు ఇతర ప్రజాప్రతినిధి వేదికల్లో తగిన అవకాశం కల్పించాలని కోరారు.

అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దూదేకుల కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముస్లిం సమాజంలో భాగమైన దూదేకుల వారికి హజ్ కమిటీ మరియు వక్ఫ్ బోర్డు కమిటీలలో కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.

ఆర్థికంగా వెనుకబడిన దూదేకుల సమాజ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తమ సమాజాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ రాళ్లపల్లి షరీఫ్, హిందూపూర్ పార్లమెంట్ దూదేకుల సాధికార సమితి అధ్యక్షులు సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.