loading

0%

ప్రధాని మోడీతో ముగిసిన చంద్రబాబు భేటీ దాదాపు గంట పైన సాగిన భేటీ

రాష్ట్ర పరిస్థితులు, ఏపీ అభివృద్ధికి సహకారం వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు. 

 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర వార్షిక బడ్జెట్ లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా, నిధుల కేటాయింపులపై చర్చలు. 

 అమరావతి నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్ లో ప్రతిపాదించిన రూ.15 వేల కోట్ల ఆర్ధిక సాయాన్ని వేగవంతం చేయాలని కోరిన చంద్రబాబు. 

 వైజాగ్ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించినట్లు సమాచారం. 

 పోలవరం నిర్మాణానికి సహకారం, వరద సెస్ కు అనుమతి ఇవ్వాలని కోరిన చంద్రబాబు.

 ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు  కే రామ్మోహన్ నాయుడు,  శ్రీనివాసవర్మ,  పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీ కృష్ణదేవరాయలు కూడా పాల్గొన్నారు.