loading

0%

దూదేకుల సంఘం నెల్లూరు రూరల్ నాయకులు షేక్ అల్లా బక్షు దారుణ హత్య

  • నెల్లూరు అయ్యప్పగుడి సెంటర్లో హత్య..!!
  • అర్ధరాత్రి దాటాక ఓ టిఫిన్ బండి వద్ద టిఫిన్ చేస్తుండగా కొందరు యువకులు మధ్య గొడవ
  •  క్షణికావేశంలో అల్లా భక్షు అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన వ్యక్తి కత్తితో గుండెల్లో పొడవడంతో తీవ్రగాయాలయ్యాయి. 
  • విషయం తెలుసుకున్న వేదయపాలెం పోలీస్ స్టేషన్ CI, స్థానిక వైసీపీ నేత రాజేష్ తదితరులు అల్లాబక్షు ని హుటాహుటిన కిమ్స్ కి తరలింపు
  • చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందిన భక్షు..
  • అల్లా భక్షుకు హాంతకుడికి ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. జాకీర్ హుస్సేన్ నగర్ లో జరిగిన హత్యలాగే... క్షణికావేశంలో.హత్య
  • మద్యం మత్తులో ఉన్న హంతకుడు..
  • హంతకులు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 
  •  అల్లా భక్షు మరణం యావత్  నూర్ భాషా యూత్ సంఘానికి   తీరని లోటు ...
  • ఈ సంఘటన  నెల్లూరు దూదేకుల బంధువులు కలచివేసింది. 

నూర్ భాషా కుటుంబాలకి రూరల్ లో ఏదైనా సమస్య వస్తే మొదట స్పందించే వ్యక్తి మన షేక్ అల్లా బక్షు.అని ఎన్నో సమస్యలని జిల్లా దృష్టికి తీసుకువచ్చి వారికి న్యాయం చేసినటువంటి   వ్యక్తి, అని ,  మన కులపు సమస్యలు పై అనేకసార్లు అధికారుల తో పోరాడిన వ్యక్తి, అని , మన యూత్ టీమ్ లో ఒక గట్టి నాయకుడిని కోల్పోయామని  

అర్ధరాత్రి అయినా  రోడ్డు మార్గమధ్యంలో ఎవరికైనా వాహన రిపేరు సమస్య ఉంటే గ్రూప్లో పోస్ట్ చేసిన వెంటనే  వారి సహాయ సహకారాలు అందించే వ్యక్తి  ట్రావెల్ అల్లాబక్షు అని  ఆయనకు  కుక్కలంటే ప్రాణం మని  ప్రతిరోజు రాత్రి ఇంటికి పోయే సమయంలో అనేక కుక్కలకి బిస్కెట్లు పెట్టందే ఇంటికి వెళ్లడని.  మంచి హెల్పింగ్ నేచర్ గల అల్లా బక్షు హత్య జరగటం జీర్ణించుకోలేకపోతున్నామని నెల్లూరు జిల్లా యువజన అధ్యక్షులు షేక్ సుభాన్ తెలిపారు.