loading

0%

డీఎస్సీ యాజమాన్య ఐచ్ఛికాల స్వీకరణ

  • విద్యార్హత ధ్రువపత్రాల అప్లోడ్ అప్పుడే
  • రెండు విభాగాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ
  • ప్రత్యేక విద్య టీచర్ పోస్టులకు మరో నియామక పరీక్ష
  • ఈనాడు, అమరావతి: మెగా డీఎస్సీ దరఖాస్తులో అధి

కారులు కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. దరఖాస్తు ఏ, బీ విభాగాలుగా విభజించి వివరాలు సేకరించనున్నారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ, పురపాలక, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్ జేసీ, సంక్షే మశాఖల యాజమాన్యాల ఎంపికకు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్-బీలో సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి దర ఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం కల్పిస్తారు. పదో తరగతి నుంచి బీఈడీ వరకు ఉన్న అన్ని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి వస్తుంది. న్యాయ వివాదాలు తగ్గించి, త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు. గతంలో దరఖాస్తులు స్వీకరిం చిన తర్వాత ఎంపిక జాబితా విడుదల చేసి, యాజమా న్యాలకు ఐచ్ఛికాలు, ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేవారు. ఈ ప్రక్రియలో అనేక వివాదాలు తలెత్తుతున్నట్లు గుర్తిం చిన అధికారులు.. ఈసారి మార్పులు చేశారు. అభ్యర్థులు యాజమాన్యాల వారీగా ఇచ్చిన ఐచ్చికాల ప్రకారం వారికి వచ్చిన ర్యాంకులతో పోస్టులు కేటాయిస్తారు.

ప్రత్యేక విద్యకు స్పెషల్ డీఎస్సీ

కొత్తగా మంజూరు చేసిన 2,260 ప్రత్యేక విద్య టీచర్ పోస్టులను ఈ డీఎస్సీలో కలపడం లేదు. వీటి భర్తీకి ప్రత్యే కంగా మరో ప్రకటన విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణ యించింది. గతంలో ప్రకటించిన పోస్టుల వరకే ఇప్పుడు ఇవ్వబోయే డీఎస్సీలో ఉంటాయి. ప్రత్యేక విద్య టీచర్ పోస్టు లను ఇందులోనే కలిపితే పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోకపోవడంతో పాటు పోస్టుల రిజర్వేషన్లు, ఇతర అంశాలతో మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నం దున ప్రత్యేక విద్యకు మరో డీఎస్సీ ఇవ్వాలని నిర్ణయించారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేం దుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్, రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ జారీ అనంతరం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. కొత్త రిజర్వే షన్ల ప్రకారం ప్రకటన ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేశారు. గతంలో ప్రకటించినట్లే రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

పరీక్ష నిర్వహించేందుకు సమయం

డీఎస్సీ ప్రకటన తర్వాత పరీక్ష నిర్వహించేందుకు 45 రోజుల సమయం ఇవ్వనున్నారు. అభ్యర్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు. కొంతమంది ఉపా ధ్యాయ అర్హత పరీక్షతో కలిపి డీఎస్సీ నిర్వహించాలని కోరు తున్నా.. ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒక్కటే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ పోస్టుల భర్తీలోపు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తి చేస్తారు. ఇందులో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను సర్దుబాటు చేస్తారు. అవసరం లేని చోట పోస్టు లను తొలగించి, పిల్లలు అధికంగా ఉన్న చోటకు వీటిని మార్పు చేస్తారు. మిగులు ఉపాధ్యాయుల జాబితా సిద్ధమైన తర్వాత పోస్టుల మార్పునకు ఆర్థికశాఖ నుంచి అనుమతి తీసుకుంటారు. అనంతరం బదిలీలు, సర్దుబాటు చేపడ తారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని మే నెల చివరి నాటికి పూర్తి చేస్తారు. బదిలీల తర్వాత మిగిలిన ఖాళీలను కొత్తగా డీఎస్సీ ద్వారా వచ్చే టీచర్లతో భర్తీ చేస్తారు.