loading

0%

దక్షిణాదికి డేంజర్ బెల్స్ - కేంద్రంపై ఉద్యమానికి నడుం బిగించిన స్టాలిన్

  • ఓ వైపు హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం..
  • మరోవైపు డీలిమిటేషన్తో కలిగే నష్టం ఉత్తరాది రాష్ట్రాల్లో పెరగనున్న సీట్లు
  • దక్షిణాదికి అన్యాయం తగ్గనున్న సీట్లు
  • బహుముఖ వ్యూహాలు అనుసరించక తప్పని స్థితి
  • హిందీతో ఉత్తరాదిన 25 భాషలు కనుమరుగు తమిళనాడు సీఎం స్టాలిన్ ధ్వజం

నూతన విద్యావిధానం అమల్లో భాగంగా హిందీని ఐచ్చికంగా ప్రకటించడం పట్ల తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం జోరందుకుంది. ప్రస్తుతానికిది తమిళనాడు కే పరిమితమైనా రాన్రాను దక్షిణ భారత మంతా విస్తరించే అవకాశాలు స్పష్టమౌతు న్నాయి. హిందీ వ్యతిరేక ఉద్యమం వెనుక మరో రెండేళ్ళ అనంతరం జరగనున్న నియోజకవర్గాల పునర్విభజన అంశం కూడా దాగుంది. గతంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జనాభా నియంత్రణ పథకాన్ని దక్షిణాది రాష్ట్రాలు కఠినంగా అమలు చేశాయి. జాతీయస్థాయి సగటు కంటే జననాల సంఖ్య అనూహ్యం గా తగ్గించాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య పెరుగు దలలో అనూహ్య తగ్గుదల నమోదైంది. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పథకాల్ని పెద్దగా అమలు చేయలేదు. దీంతో అక్కడ ఇబ్బడి ముబ్బడిగా జనాభా పెరిగింది. దీనివల్ల ఓటు పరంగా కూడా దక్షణాది రాష్ట్రాలు వెంకుకంజలో ఉంటున్నాయని తమిళనాడు సీఎం తెలిపారు. దీని ఆధారంగా దక్షణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నంలో కేంద్రంలోని ఉన్నాయని అయన ఆందోళన వ్యక్తం చేశాయి. దీమిమీద దక్షణాది రాష్ట్రాలు ఏకమై బహుముఖ వ్యూహాలు అమలుచేసి , దక్షణాది రాష్ట్రాల ఉనికిని కాపాడుకోవాలని అయన పిలుపునిచ్చారు