loading

0%

గుండె జబ్బులను గుర్తించడానికి AI యాప్‌ను రూపొందించిన భారత సంతతికి చెందిన యువకుడు

గుండె జబ్బులను గుర్తించడానికి AI యాప్‌ను రూపొందించిన భారత సంతతికి చెందిన యువకుడిని చంద్రబాబు నాయుడు కలిశారు

సెకన్లలో గుండె జబ్బులను గుర్తించే AI-ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసిన భారత సంతతికి చెందిన 14 ఏళ్ల విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు, అతని ఆవిష్కరణను ప్రశంసిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతిస్తుందని ప్రకటించారు. 

గుండె జబ్బులను గుర్తించడానికి AI యాప్‌ను భారత సంతతికి చెందిన యువకుడు నిర్మించాడు. ఈ సందర్భంగా విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల చేసిన  వైద్య పురోగతిని చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. అమెరికా మరియు భారతదేశంలో ఈ యాప్ ద్వారా 15,000 మంది రోగులపై పరీక్షించారని ఈ సందర్బంగా సిద్దార్థ్ తెలిపారు. 

కేవలం ఏడు సెకన్లలో గుండె జబ్బులను గుర్తించగల కృత్రిమ మేధస్సు ఆధారిత అప్లికేషన్ 'సిర్కాడియావి'ని అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన AI-సర్టిఫైడ్ ప్రొఫెషనల్ భారతీయ-అమెరికన్ విద్యార్థిగా సిద్ధార్థ్ నంద్యాల నిలిచారు 


ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం నుండి వచ్చిన ఈ 14 ఏళ్ల బాలుడు ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నాడు, ఒరాకిల్ మరియు ARM ద్వారా సర్టిఫికేట్ పొందాడు, తర్వాత అయన గుర్తింపుపొందిన AI నిపుడిగా మారారు.