loading

0%

హోమ్ గార్డుల పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ జారీ చేసిన AP CID

ఏపి సీఐడీలో 28 హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 

▪️ మే 1 నుంచి 15 వరకు దరఖాస్తుల స్వీకరణ 

రాష్ట్ర సీఐడీ విభాగంలో 28 హోంగార్డుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మే 1 నుంచి 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని సీఐడీ విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ చెప్పారు. 

 అర్హతలివే... 

ఏపీకి చెందిన వారై ఉండాలి.

వయోపరిమితి: 18-50 ఏళ్ల మధ్య (2025 మే 1 నాటికి) ఉండాలి. 

ఎత్తు: పురుషులు 160 సెం.మీ. మహిళలు 150 సెం.మీ. (ఎస్టీ మహిళా అభ్యర్థులకు 5 సెం.మీ. మినహాయింపు) కనీస విద్యార్హత ఇంటర్మీడియట్, బీటెక్, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. కంప్యూటర్ నైపుణ్యాలు, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి.

 ఎంపిక ప్రక్రియ 

ధ్రువపత్రాల పరిశీలనతో పాటు శారీరక కొలతల పరీక్ష, కంప్యూటర్, టైపింగ్, డ్రైవింగ్ నైపుణ్యాలపై పరీక్ష ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రోజుకు రూ.710 చొప్పున డ్యూటీ అలవెన్స్ చెల్లిస్తారు.

 ధరకాస్తులు పంపాల్సిన చిరునామా 

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీసు హెడ్ క్వార్టర్స్, మంగళగిరి-522503 చిరునామాకు నేరుగా లేదా రిజిస్టర్డ్ పోస్టులో దరఖాస్తులు సమర్పించొచ్చని సూచించారు. పూర్తి వివరాలకు 94407 00860 నంబర్ను సంప్రదించాలని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.