loading

0%

విడవలూరు మండలం కో ఆప్షన్ సభ్యులు మరియు DCF సభ్యులు షేక్ రఫీ తన స్వగ్రామమైనటువంటి ముదివర్తి మసీదు నందు ఇఫ్తార్ విందు

నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి సారథ్యంతో

 విడవలూరు మండలం కో ఆప్షన్ సభ్యులు మరియు DCF సభ్యులు అయినటువంటి షేక్ రఫీ తన స్వగ్రామమైనటువంటి ముదివర్తి మసీదు నందు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడమైనది మరియు మండలంలోని అన్ని మసీదుల ఇమామ్ మరియు మౌజనులకు రంజాన్ పర్వదినం సందర్భంగా నూతన దుస్తులు పంపిణీ చేయడమైనది

 పై కార్యక్రమంలో భాగంగా అన్ని మతాల వారికి సబుద్ధిని ప్రసాదించాలని దైవచింతన మరియు మంచి పెంపొందించే విధంగా మానవాళి నడుచుకోవాలని ఆ అల్లాని ప్రార్థిస్తూ మరియు

 పేద ప్రజలకు సహాయం చేయడంలో ముందున్నటువంటి MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి మంచి జరగాలని అనంత కరుణామయుడు కృప కలిగినటువంటి ఆ అల్లాను ప్రార్ధిస్తూ దువా చేయడమైనది 

పై కార్యక్రమంలో   తెలుగుదేశం పార్టీ నాయకులు ,రాష్ట్ర మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ అబూబకర్ గారు, DCF స్టేట్ ఆర్గనైజింగ్ సభ్యులు షేక్ అల్తాఫ్, తెలుగుదేశం పార్టీ మైనారిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఇమామ్ భాష గారు, DCF జిల్లా ఆర్గనైజింగ్ సభ్యులు షేక్ హజరత్ అలీ, తెలుగుదేశం పార్టీ విడవలూరు మండలం ఇంచార్జ్ అడపాల శ్రీధర్ రెడ్డి గారు , పొన్నలూరు పురంధర్  రెడ్డి గారు, సత్య వోలు సత్యం రెడ్డి గారు, పాశం శ్రీహరి రెడ్డి గారు, గౌడ సంఘం నాయకులు అంతటి శ్రీనాథ్ గారు, మరియు ముస్లిం మత పెద్దలు, గ్రామస్తులు పాల్గొనడం అయినది