17, Apr-2025
loading
0%26,Mar-2025
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై(డీలిమిటేషన్) తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన రాజకీయ పార్టీల ఐక్య కార్యాచరణ సమితి(జాయింట్ యాక్షన్ కమిటీ - జేఏసీ) సమావేశం మార్చి 22న చెన్నైలో జరిగింది.
దేశంలో జనాభా ప్రాతిపదికన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను జేఏసీ సమావేశం తీవ్రంగా వ్యతిరేకించింది. 1971 జనాభా ప్రాతిపదికన, ప్రస్తుతమున్న ఎంపీల సంఖ్యనే మరో పాతికేళ్లు కొనసాగించాలని జేఏసీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, అక్కడి ప్రభుత్వాలతో కూలంకుషంగా చర్చించిన తర్వాతే పునర్విభజనపై కేంద్రం ముందుకెళ్లాలని ఈ జేఏసీ సమావేశం తీర్మానించింది. అయితే, ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఒక్క పార్టీ ప్రతినిధులు హాజరుకాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఎవరెవరు హాజరయ్యారు?
డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో జేఏసీ తొలిసారిగా సమావేశమైంది. మొత్తం 14 పార్టీల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఒడిశా మాజీ మంత్రి సంజయ్ కుమార్, ముస్లిం లీగ్ నేత పీఎంఏ సలాం, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఎస్.కె పరమచంద్రన్ సహా ఇతరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ వీడియో సందేశం పంపారు.
తమ డిమాండ్లపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాన నరేంద్ర మోదీకి ఉమ్మడిగా వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. తదుపరి సమావేశాన్ని బహిరంగ సభగా హైదరాబాద్‌లో నిర్వహించాలని తీర్మానించారు.
డీ లిమిటేషన్‌ను పాతికేళ్లు వాయిదావేయాలనే డిమాండ్ దేనికి?
ఫొటో క్యాప్షన్,డీలిమిటేషన్‌ను 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని దక్షిణాది రాష్ట్రాల నేతలు డిమాండ్ చేశారు.
ఏపీ నుంచి ఒక్కరూ వెళ్లలేదు..
ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రతినిధి కూడా హాజరుకాలేదు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల నుంచి అధికార, విపక్ష నేతలు పాల్గొన్నారు.
పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ హాజరయ్యారు. కానీ, ఏపీలో అటు అధికార పక్షం నుంచిగానీ, విపక్షం నుంచిగానీ ఏ ఒక్కరూ హాజరుకాలేదు.
జనాభా ప్రాతిపదికన నియోజవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రంలో ఎంపీ సీట్ల సంఖ్య తగ్గిపోతుందని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు, విపక్ష నేత - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.
కానీ, స్టాలిన్ సమావేశానికి టీడీపీ, వైసీపీతో పాటు జనసేన నుంచి కూడా ఎవ్వరూ హాజరుకాలేదు.
బాబు - జగన్ - పవన్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఆదివారం నాటి సమావేశానికి హాజరయ్యాయి. ఎన్డీయే కూటమిలో టీడీపీ భాగస్వామ్య పార్టీగా ఉన్నందునే చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి హాజరుకాలేదన్న చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ జేఏసీ సమావేశానికి సంబంధించి ఆహ్వానం అందలేదని సీఎం సీపీఆర్వో ఆలూరి రమేశ్ బీబీసీతో చెప్పారు.వాస్తవానికి, ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులను చెన్నైలోని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించేందుకు డీఎంకే మంత్రి ఈవీ వేలు, ఎంపీ విల్సన్ మార్చి 12న ఏపీకి వచ్చారు. వీరు అమరావతిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాసిన లేఖను వైఎస్ జగన్‌కు డీఎంకే నేతలు అందజేశారు. అయినప్పటికీ, వైఎస్ జగన్ కానీ, ఆయన పార్టీ ప్రతినిధులు కానీ జేఏసీ సమావేశంలో పాల్గొనలేదు. అదే రోజు, జనసేన అధ్యక్షుడు పవన్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో జనసేన పార్టీ నేతలకు ఆ లేఖను అందించి వెనుదిరిగారు.
మోదీకి జగన్ లేఖ
చెన్నైలో జరిగిన అఖిలపక్ష భేటీకి హాజరుకాని వైఎస్ జగన్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఇదే విషయమై లేఖ రాశారు. 2026లో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానిని వైఎస్ జగన్ ఆ లేఖలో కోరారు. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపులో భాగంగా, గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గిందనీ, ఈ దశలో జనాభా