loading

0%

వక్ఫ్‌ బిల్లుపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేయనున్న డిఎంకె

చెన్నై : లోక్‌సభలో వక్ఫ్‌బిల్లు ఆమోదంపై డిఎంకె సుప్రీంకోర్టులో సవాల్‌ చేయనుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ గురువారం తెలిపారు. ఈ బిల్లును మిత్రపక్ష పార్టీల మద్దతుతో కేంద్రం ఈ బిల్లును ఆమోదించింది. కేంద్రం హడావిడిగా ఈ బిల్లును ఆమోదించడానికి వ్యతిరేకంగా డిఎంకె సుప్రీంకోర్టులో కేసు నమోదు చేయనున్నట్లు స్టాలిన్‌ తెలిపారు. వక్ఫ్‌ బిల్లుకి వ్యతిరేకంగా ఆయన నేడు అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీ ధరించి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం నిర్మాణంపై దాడి చేస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
కాగా, ఈ బిల్లుపై ఆయన మాట్లాడుతూ.. ‘మెజార్టీ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నప్పటికీ మిత్రపక్షపార్టీల మద్దతుతో గురువారం తెల్లవారుజామున 2 గంటలకు కేంద్రం ఆమోదింపజేసుకుంది. ఈ వివాదాస్పద సవరణకు వ్యతిరేకంగా డిఎంకె సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయనుంది. వక్ఫ్‌బోర్డు స్వయంప్రతిపత్తిని నాశనం చేసే, మైనారిటీ జనాభాను బెదిరించే కేంద్ర ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతుంది’ అని ఆయన అన్నారు.