loading

0%

దూదేకుల ముద్దుబిడ్డ కోసిగి విద్యార్థినికి స్టేట్ సెకండ్ ర్యాంకు

దూదేకుల ముద్దుబిడ్డ  కోసిగి విద్యార్థినికి స్టేట్ సెకండ్ ర్యాంకు

దేశంలోనే అక్షరాస్యతలో చిట్టచివరి నుంచి రెండో స్థానంలో ఉన్న కోసిగి మండలం ఇప్పు డిప్పుడే అక్షరాస్యతలో అన్ని మండలాల కంటే దీటుగా ముందుకు వెళ్తుందని చెప్ప డానికి శనివారం విడుదలైన ఇంటర్ ఫలితాలు నిదర్శనం. కోసిగి చెందిన పింజారి రిజ్వానా ఇంటర్ సెకండియర్ బైపీసీలో 987/1000 మార్కులతో స్టేట్ రెండో ర్యాంకు సాధించారు. కోసిగి ఆర్టీసీ బస్టాండు ఎదురుగా నివాసముంటున్న పింజారి ఉమర్, ఫాతిమా దంపతుల మొదటి కుమార్తె పింజారి రిజ్వానా ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు కోసిగి లోని స్థానిక చౌడేశ్వరి పాఠశాలలో, 6 నుంచి 10 వరకు కోసిగిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించి 10లో 574 మార్కులతో పాఠశాల టాప ర్గా నిలిచింది. ఇంటర్ విజయవాడలోని ఓ ప్రైవేటు కాలే జీలో చదివారు. కోసిగి విద్యార్థిని రెండో స్టేట్ ర్యాంకు సాధించడంపై మండల ప్రజలు, ఉపాధ్యాయులు రిజ్వా నను అభినందించారు.