loading

0%

న్యాయవ్యవస్థపై ప్రతీరోజు దాడి జరుగుతోంది: సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా

న్యాయవ్యవస్థపై ప్రతీరోజు దాడి జరుగుతోంది: సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా 

భారత రాష్ట్రపతి, గవర్నర్లు వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలంటూ భారత అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ పార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, బీజేపీ ఎంపీ నిశికాంత్ ధూబే సుప్రీం కోర్టు నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు జస్టిస్ సూర్య కాంత్ స్పందించారు.

 "తామేమీ బాధపడటం లేదు.. ప్రతీ రోజు న్యాయ వ్యవస్థపై దాడి జరుగుతూనే ఉంది" అని అన్నారు. కాగా నిన్న ఓ కేసు విషయంలో కాబోయే చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్.. "శాసన, కార్యనిర్వహక వ్యవస్థల్లో జోక్యం చేసుకుంటున్నామని మేము ఆరోపణలు ఎదుర్కొంటున్నాము" అని అన్నారు.

తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌లో జగదీప్ ధన్ ఖడ్ మాట్లాడుతూ.. "ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులే రాజ్యాంగానికి మాస్టర్లు. వాళ్లకంటే పై స్థాయి వారు ఎవరూ లేరు" అని అన్నారు. ఆర్టికల్ 142 విషయంలోనూ భారత అత్యున్నత న్యాయ స్థానంపై మండిపడ్డారు.