loading
0%24,May-2025
నెల్లూరు జిల్లా బీసీ దూదేకుల సంఘం 157/2015 పై అసంతృప్తి జ్వాలలు
నెల్లూరు జిల్లాలో 157/2015 సంఘం ఆధ్వర్యంలో జరుపతలపెట్టిన ప్రతిభాపురస్కారాల కార్యక్రమంపై జిల్లాలో అసంతృప్తి నెలకొంది. ఈ కార్యక్రమం నిర్వాహకులు జిల్లాలో 157/2015 సంఘంలో పనిచేసే అందరు నాయకులను కలుపుకునిపోవటం లేదని , ముఖ్యంగా యువత విభాగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని అత్యధికులు విమర్శిస్తున్నారు.
ఇప్పటికే జిల్లా పరిస్థితులు సరిచేయమని పలుమార్లు , రాష్ట్ర నాయకత్వానికి విన్నవించామని అయినా పట్టించుకున్నవారు లేరని నెల్లూరు జిల్లా యూత్ అధ్యక్షులు షేక్ సుభాన్ బాషా మరియు ప్రధానకార్యదర్శి షేక్ అల్తాఫ్ వాపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో గత 13 సంవత్సరాలనుండి అధ్యక్షుడి మార్పు జరగలేదని , రాష్ట్ర నాయకులు కూడా పలుమార్లు మాట ఇచ్చి తప్పారని వారు తెలియచేసారు. ఇది ఇలానే జరిగితే తమ నిర్ణయం తాము తీసుకోక తప్పదని తెలిపారు.
ఫై విషయం గురించి టౌన్ అధ్యక్షులు బాబర్జన్ మాట్లాడుతూ
"నెల్లూరు జిల్లా యువత సభ్యులు మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. అందరి ఆమోదం పొందినప్పుడే ఏ సంఘమైన ఎక్కువకాలం మనుగడలో ఉంటుంది అలాకాకుండా నియంత ధోరణితో వెళ్లినప్పుడు పతనానికి పునాది అవుతుంది"
షేక్ ఖాజా మస్తాన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మాట్లాడుతూ
నూర్ భాషా సంక్షేమ సంఘం రిజిస్టర్ నెంబర్ 157 ఈ సంఘం రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తుంది ఈ సంఘంలో అనేకమంది ముఖ్య నాయకులు కార్యకర్తలు రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ సంఘంలో కలిసిమెలిసి ఒకే మాటగా ఒకే బాటగా పనిచేస్తున్నారు ఈ మధ్యకాలంలో నెల్లూరు జిల్లా బాడీలో అనేక సమస్యలు వచ్చాయి ఆ సమస్యల్ని రాష్ట్ర కమిటీ బాధ్యత తీసుకొని పరిష్కరించకుండా ఒక గ్రూప్ కి సపోర్ట్ చేసి పురస్కార బహుమతులు ఈనెల 31వ తేదీన అందజేసే దానికి ప్రయత్నం జరుగుతోంది కానీ రెండు గ్రూపులు లను సమన్వయం చేసి ఒక తాటిమీద నడిపించే ప్రయత్నం చేయకుండా రాష్ట్ర కమిటీ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు వెంటనే రాష్ట్ర కమిటీ జోక్యం చేసుకొని అందరిని సమన్వయం చేసి ఆ కార్యక్రమాన్ని జరిపితే బాగుంటుంది లేకపోతే గొడవలు రచ్చలు వచ్చే దానికి అవకాశం ఉంది దీని వెంటనే రాష్ట్ర కమిటీ స్పందించాల్సిన అవసరం ఉంది
ఖాసీం సైదా, కోస్తాంధ్ర ప్రధాన కార్యదర్శి, యూత్ కమిటీ. మాట్లాడుతూ
గత 15 సంత్సరాలనుండి సంఘాన్ని భుజాల మీద మోస్తున్నది యూత్ విభాగమే, పెద్దల సలహాలతో ముందుకు వెళుతున్నాము. మా యూత్ అధ్యక్షుడు మస్తాన్ అన్న చెప్పినట్టు ప్రతిజిల్లాలో యూత్ కమిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లాలో దానితో పాటు అన్ని జిల్లాలలో యూత్ కమిటీలకు ప్రాధాన్యత ఉంటేనే అందరూ ముందుకు వచ్చి పనిచేస్తారు. ఈ విషయంలో రాష్ట్ర పెద్దలు చొరవ చూపించాలి