loading
0%08,May-2025
జమ్ములో ఉగ్రవాద దాడులు, రాకెట్ దాడి, పేలుళ్లతో నగరమంతా ఆందోళన. విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాక్‌అవుట్. పాకిస్థాన్ డ్రోన్లు కూల్చివేత. భద్రతా చర్యలు కట్టుదిట్టం.
జమ్ములో మరోసారి ఉగ్రవాదం బీభత్సం సృష్టించింది. జమ్ము ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడి జరగగా, నగరంలోని ఏడు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు విన్నామని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలతో నగరమంతా తీవ్ర ఆందోళనలోకి వెళ్లింది.
నగరమంతా బ్లాక్‌అవుట్..
దాడుల నేపథ్యంలో జమ్ము నగరం మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో బ్లాక్‌అవుట్ ఏర్పడింది. రాత్రి సమయంలో మొత్తం నగరం చీకటిలో కూరుకుపోయింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రజలంతా బయటకి రావొద్దని, అత్యవసర పనుల్లేకుంటే ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంఘటనల మధ్య పాకిస్థాన్ నుండి వచ్చిన అనుమానాస్పద డ్రోన్లు భారత గగనతలంలో కదులుతున్నట్లు గుర్తించిన భారత సైన్యం, వాటిని పలుచోట్ల తక్షణమే కూల్చివేసింది. సరిహద్దు వద్ద భద్రతా బలగాలు అప్రమత్తంగా మోహరించాయి. మరోవైపు, ఏదైనా అవాంఛనీయ ఘటన జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.