loading
0%15,May-2025
ఏపీఆర్‌జేసీ ఫలితాలు విడుదల.. aprs.apcfss.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
ఆంధ్రప్రదేశ్ గురుకుల రెసిడెన్షియల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీఆర్‌జేసీ రిజల్ట్స్ 2025 విడుదలకు సమయం వచ్చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఏపీఆర్‌జేసీ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఆర్‌జేసీ సెట్ 2025) ఫలితాలు కొద్దిసేపటి క్రితం అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి. ఈ ఏపీఆర్‌జేసీ సెట్ 2025 పరీక్షను ఏప్రిల్ 25న నిర్వహించారు. 2025-2026 విద్యా సంత్సరానికి ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి 2025 మార్చి 31వ తేదీతో ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే.. విద్యార్థులు సౌకర్యార్థం మరో 6 రోజులు గడువు పొడిగించారు. ఈ మేరకు విద్యార్థులు 2025 ఏప్రిల్ 6వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
అయితే.. ఈ ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 25న నిర్వహించారు. విద్యార్థులు ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను https://aprs.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఏపీఆర్‌జేసీ సెట్ 2025 రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే. అలాగే.. ఇటీవల ఏపీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఇంటర్‌లో ప్రవేశాలకు సంబంధించి 13,680 సీట్లకు 32,733 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్షల్లో విశాఖ జిల్లాకు చెందిన విద్యార్థి మొదటి ర్యాంకు, కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు రెండు, మూడు ర్యాంకులను సాధించారు.
ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే.. తాజాగా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీఆర్‌డీసీ సెట్-2025) ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏపీఆర్‌డీసీ సెట్ ఫలితాలు చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి. ఈ ఏపీఆర్‌డీసీ సెట్ ప్రవేశ పరీక్షను సైతం ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించారు.