loading
0%16,May-2025
నేటి వార్తల ముఖ్యాంశాలు
▪️రాబోవు మూడు రోజులు రాష్ట్రంలో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడి.
▪️రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. కర్నూలు రైతుబజార్ లో స్వచ్ఛంద్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు.
▪️రాష్ట్రంలో 33 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి.. వాటి ద్వారా 34 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం.
▪️రాజధాని పనులకు బడ్జెట్ నుండి మొదటి త్రైమాసిక నిధులు 2100 కోట్లు విడుదల.
▪️18 నెలల్లోనే శాశ్వత అసెంబ్లీ భవనం నిర్మాణం.. ఒప్పందం కుదుర్చుకున్న ఎల్ & టి సంస్థ.
▪️విజయవాడ మెట్రోకు 11,009 కోట్లు, భూసేకరణకు 1152 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాధమిక నివేదికలు సిద్ధం. త్వరలోనే డిపియర్ తయారీ బాధ్యతలు సిస్ట్రా కన్సల్టెన్సీకి అప్పగింత.
▪️రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు అనుమతులు మంజూరు.. నేటి నుంచి జూన్ 2 వరకు నిషేధం సడలిస్తూ ఉత్తర్వులు విడుదల.
▪️నిన్నటితో ముగిసిన డీఎస్సీ దరఖాస్తు గడువు. 3,53,598 మంది అభ్యర్థులు 5,67,067 దరఖాస్తులు చేసినట్లు తెలిపిన డీఎస్సీ కన్వీనర్.
▪️ ఈసెట్ పరీక్ష ఫలితాలు విడుదల. 93.26% మంది అర్హత సాధించారు.
▪️రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి నిర్దేశించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా.. అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకు 14 ప్రశ్నలు సంధించారు