loading
0%21,May-2025
నేటి వార్తల ముఖ్యాంశాలు
▪️నేడు పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన..ఈనెల 26 నాటికి రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు.
▪️నేడు కుటుంబ సమేతంగా కుప్పంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. గంగమ్మ జాతరకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం అమరావతి చేరుకుంటారు.
▪️వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు పర్యవేక్షణకు ఆరుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు.
▪️జూన్ 1నుంచి ఇంటింటికీ రేషన్ వాహనాలు రావు.. దుకాణాల వద్దకు వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికే పంపిణీ చేసేలా చర్యలు.
▪️రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు ఉత్తర్వులు విడుదల.
▪️రాష్ట్రంలో ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ కు భారీ ఊరట.. ఇకనుండి హరిత పన్ను 1500-3000 వరకు మాత్రమే వసూలు చేసేలా కేబినెట్ నిర్ణయం.
▪️22- A భూములపై త్వరలో నూతన విధానం. 8 కేటగిరీలుగా ఫ్రీ హోల్డ్. ఫ్రీ హోల్డ్ చేస్తే ఆ భూమి లబ్ధిదారులకే ఇస్తాం. మంత్రివర్గ ఉపసంఘంలో కీలక నిర్ణయం.
▪️జూలై 2 నుంచి కర్నూలు - విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతీ సోమ, బుధ, శుక్రవారాల్లో సేవలు ఉంటాయన్నారు.
▪️ కోర్టులను రాజకీయ పార్టీలు తమ క్రీడా మైదానాలుగా వాడుకుంటున్నాయి.. హైకోర్టు స్థాయిని మేజిస్ట్రేట్ కోర్టు స్థాయికి తెచ్చారు.. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక పిటిషన్ విచారణలో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.