6,100 కానిస్టేబుల్ పోస్టుల తుది రాతపరీక్ష హాల్ టికెట్లు
6,100 కానిస్టేబుల్ పోస్టుల తుది రాతపరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నేటి నుంచి మే 31 వరకు slprb.ap.gov.in/చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏవైనా సమస్యలు ఉంటే 9441450639 హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
జూన్ 1 ఉ. 10 గం. నుంచి మ. 1 గం. వరకు విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి నగరాల్లో పరీక్షలు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల తుది రాతపరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను SLPRB వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయు విధానం:
- ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ కి వెళ్ళండి.
- "Download Hall Ticket for SCT PCs (Civil and APSP)" లింక్ పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి.
- హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.