loading
0%02,Mar-2025
హైదరాబాద్, మార్చి 2 : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో భాగంగా తెలంగాణ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నది. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందే సెంటర్ల గేట్లు క్లోజ్ చేయాలని నిర్ణయించింది. ఉదయం 8:45 గంటలలోపు వచ్చిన వారినే పరీక్షకు అనుమ తించనున్నది. ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థి తుల్లో అనుమతించొద్దని నిర్ణయించింది.
విద్యార్థులు ఉదయం 8:30గంటలకల్లా పరీ క్షాహాల్లో ఉండాలన్న నిబంధనను బోర్డు తొలిసారిగా అమల్లోకి తీసుకొచ్చింది. ఇలా పరీక్ష ముందే గేట్లు క్లోజ్ చేయడం ఇదే తొలి సారి. ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేయగా.. 9,96,541 మంది విద్యార్థులు హాజరుకాను న్నారు. వీరిలో ఫస్టియర్ వారు 4,88,316 ఉండగా, 5,08,225 మంది సెకండియర్ విద్యార్థులున్నారు. ఏవైనా సందేహాలుంటే 92402 05555 టోల్ ఫ్రీ నంబర్తోపాటు, జిల్లా కంట్రోల్ రూం ఇన్చార్జి నంబర్లను సంప్రదించవచ్చు.
నిమిషం నిబంధన మరిచిపోవాల్సిందే..
ఇంటర్ పరీక్షల్లో నిమిషం లేట్గా వచ్చిన వారికి నో ఎంట్రీ నిబంధన చాలా కాలంగా అమలవుతున్నది. ఈ నిబంధన కారణంగా పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులెందరో త్రుటిలో అవకాశం చేజార్చుకున్నారు. 2024 మార్చి వార్షిక పరీక్షలప్పుడు తొలిరోజే ఆదిలా బాద్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి సెంటర్కు ఆలస్యంగా చేరుకోవడం, సదరు విద్యార్థి ఆత్మ హత్యకు పాల్పడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. తేరుకున్న సర్కారు నిమిషం నిబంధనను సడలించి, ఐదు నిమిషాల వరకు మినహాయింపు ఇచ్చింది. ఆ తర్వాతి పరీక్షల్లో ఐదు నిమిషాలు లేట్గా వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతి ఇచ్చారు. ఇంటర్ అడ్వా న్స్డ్ సప్లిమెంటరీ సమయంలోనూ ఐదు నిమిషాలు లేట్ నిబంధన అమలయ్యింది. కానిప్పుడు 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణ యంతో ఒక నిమిషం లేట్ ఎంట్రీ నిబంధన కాలగర్భంలో కలిసిపోయినట్లయ్యింది.