loading

0%

రంజాన్ తొలి రోజున సేవా కార్యక్రమం క్యాన్సర్ బాధితురాలికి ఆదం షఫీ సహాయం

రంజాన్ తొలి రోజున సేవా కార్యక్రమం క్యాన్సర్ బాధితురాలికి ఆదం షఫీ సహాయం

గుంటూరు, శారదా కాలనీ:
రంజాన్ పవిత్ర నెల తొలి రోజున ఒక హృద్యమైన సేవా కార్యక్రమం చోటుచేసుకుంది. శారదా కాలనీ ఐదు లైన్‌కు చెందిన షేక్ నాగూర్ బి గారు క్యాన్సర్ మూడో దశలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో, గుంటూరు నగర నూరు బాషా దూదేకుల సంఘ అధ్యక్షుడు ఆదం షఫీ సహాయక చర్యలు చేపట్టారు.

నాగూర్ బి గారి కుటుంబ సభ్యురాలు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో, ఆదం షఫీ వెంటనే గవర్నమెంట్ హాస్పటల్‌కు చేరుకుని వైద్యులతో మాట్లాడారు. వైద్యులు అవసరమైన పరీక్షలు నిర్వహించాలని సూచించగా, శారీరకంగా బలహీనంగా ఉన్న నాగూర్ బి గారికి ధైర్యం చెప్పి పరీక్షలకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు.

ఆయాసంతో నడవలేని పరిస్థితిలో ఉన్న బాధితురాలికి నర్సింగ్ సిబ్బందిని సంప్రదించి కుర్చీ ఏర్పాటు చేసి, టెస్టుల కోసం స్వయంగా తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ఆదం షఫీ మాట్లాడుతూ, “రంజాన్ తొలి రోజున ఇలాంటి సేవ చేసే అవకాశం కలిగించడం అల్లాహ్ కరుణగా భావిస్తున్నాను” అని తెలిపారు.

స్థానికులు ఆదం షఫీ చేసిన సేవను అభినందిస్తూ, మానవత్వానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు.