06, Apr-2025
loading
0%06,Apr-2025
ధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మరో రెండు రోజులపాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులకు ఆస్కారం ఉందని, వాతావరణ అనిశ్చితి నేపథ్యంలో అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు. సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
ఆదివారం (06-04-25) ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
సోమవారం (07-04-25) అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శనివారం రాత్రి 8 గంటల నాటికి కాకినాడ జిల్లా వేలంకలో 56.2మిమీ, ఏలేశ్వరంలో 48.5మిమీ, కోటనందూరులో 45.2మిమీ, అనకాపల్లి నర్సీపట్నంలో 44.5మిమీ, బలిఘట్టంలో 43.2మిమీ, శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేటలో 43.2మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని వెల్లడించారు. అలాగే 33 ప్రాంతాల్లో 20మిమీ కు పైగా వర్షపాతం నమోందైందని తెలిపారు.
మరో వైపు ఎండ తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందన్నారు. శనివారం అనకాపల్లి జిల్లా మాడుగులలో 39.8°C, నంద్యాల జిల్లా గోనవరం, శ్రీకాకుళం జిల్లా పొందూరు లో 39.7°C, పల్నాడు జిల్లా రావిపాడు 39.6°C, చిత్తూరు జిల్లా నగరి, కర్నూలు జిల్లా సాతనూరు, ప్రకాశం జిల్లా పునుగోడు, వైఎస్సార్ జిల్లా వేమనపురంలో 39.4°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైందని వెల్లడించారు.
తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఇదే..
ఉత్తర మధ్య మహారాష్ట్ర నుండి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ రోజు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది.. సోమవారం తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం.. ఈ మేరకు తెలంగాణలోని పది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు..
ఆదివారం గరిష్టంగా ఆదిలాబాద్ లో 39.8 కనిష్టంగా హైదరాబాద్ లో 35.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.. శనివారం తెలంగాణ లోని ఖమ్మం, నిజామాబాద్, రామగుండం, ఆదిలాబాద్ లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం..37, నిజామాబాద్..37, రామగుండం..36.4, ఆదిలాబాద్..36.3, భద్రాచలం..35.8, మెదక్..35.6, మహబూబ్ నగర్..35.5, నల్లగొండ..35.5, హనుమకొండ..34.5, హైదరాబాద్..33 డిగ్రీల పగలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..