15, Apr-2025
loading
0%06,Apr-2025
హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో మైనర్ల డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ఇకపై మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే, వారి తల్లిదండ్రులను లేదా వాహన యజమానులను కూడా బాధ్యులుగా పరిగణిస్తారు.
మైనర్లు నడిపిన వాహనం యొక్క రిజిస్ట్రేషన్‌ను ఏడాది పాటు రద్దు చేస్తామని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, వాహనం నడుపుతూ పట్టుబడిన మైనర్లు 25 సంవత్సరాలు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అనర్హులని స్పష్టం చేశారు.
ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు తమ 'ఎక్స్' వేదికగా హెచ్చరిక జారీ చేశారు. మైనర్లకు వాహనం ఇచ్చినట్లయితే, ఏడాది వరకు వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు, మూడేళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ. 25,000 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.
Recent post
15, Apr-2025
15, Apr-2025
13, Apr-2025
06, Apr-2025