loading

0%

ఎలాన్ మాస్క్ తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ

ఎలాన్ మాస్క్ తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్‌తో మాట్లాడారు. టెక్నాలజీ, ఆవిష్కరణ రంగాలలో సహకారం గురించి చర్చించారు. దీనికి సంబంధించి పీఎం మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. "ఈ ఏడాది ఆరంభంలో వాషింగ్టన్ డిసిలో జరిగిన మా సమావేశంలో చర్చించిన అంశాలతో సహా వివిధ సమస్యలు, అంశాల గురించి ఎలాన్ మస్క్‌తో మాట్లాడాను. టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ రంగాలలో సహకారానికి ఉన్న అపారమైన అవకాశాలపై మేము చర్చించాం" అని మస్క్ యాజమాన్యంలోనే ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పీఎం మోదీ పోస్ట్‌ చేశారు. టెక్నాలజీలో అమెరికాతో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని మోడీ అన్నారు.