loading

0%

ఉత్తమ సర్పంచ్ గా దూదేకుల ముద్దుబిడ్డకు దక్కిన ఘనత

స్థానిక పాలన వ్యవహారాల తో పాటు గ్రామీణ అభివృద్ధిని సమర్థవంతంగా నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించినందుకు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా చేజర్ల మండలం నాగులవెలటూరు గ్రామపంచాయతీ సర్పంచ్ షేక్ మస్తాన్ రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులు చేతుల మీదుగా గురువారం మంగళగిరిలో ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఇంతటి గుర్తింపు రావడానికి గల కారణం గ్రామపంచాయతీకి ఆయన సూచనలు. సలహాలు అందిస్తు నన్ను ముందుకు నడిపించిన సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి గారికి గ్రామ సర్పంచ్ షేక్ మస్తాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.