loading

0%

డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్.. వైస్ చాన్సలర్ గా డా.పుల్లల చంద్రశేఖర్ నియామకం

డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్.. వైస్ చాన్సలర్ గా డా.పుల్లల చంద్రశేఖర్ నియామకం

ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. పుల్లల చంద్రశేఖర్ MD., DM.. ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ విజయవాడ వైస్ చాన్సలర్ గా నియమితులయ్యారు. ఈయన పదవీకాలం 3 సం.లు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 కార్డియాలజీ, సామాజిక రంగంలో విశేష సేవలు..

ప్రభుత్వ వైద్యునిగా 35 ఏళ్ల సర్వీస్ లో ఎంతో మందికి కార్డియాక్ పేషెంట్లకు ప్రాణం పోశారు. 2003లో డాక్టర్ పి. చంద్రశేఖర్ కర్నూలు మెడికల్ కాలేజీ కార్డియాలజీ విభాగం HOD గా బాధ్యతలు స్వీకరించడంతో ఈ విభాగం స్వర్ణయుగం ప్రారంభమైంది. 2003లో డాక్టర్ పి. చంద్రశేఖర్ ప్రారంభించిన కర్నూలు హార్ట్ ఫౌండేషన్, ప్రజల ప్రయోజనం కోసం ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలు & ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోంది. 2008లో HOD చేసిన అనేక ప్రయత్నాలు తర్వాత ఇన్వేసివ్ కార్డియాక్ క్యాత్‌లాబ్ ప్రారంభం, ఈ ప్రాంతంలోని పేద ప్రజలకు సేవలను విస్తరించడానికి మార్గం సుగమం చేసింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిలో ఈయన ప్రస్థానం చిరస్మరణీయం. దివంగత రాష్ట్రపతి ఏ.పి.జే.అబ్దుల్ కలాం నుంచి కూడా ఈయన ప్రశంసలు అందుకున్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుంచి సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ కూడా అందుకున్నారు.